'ఉపాధి హామీ కూలీలందరు ఈ కేవైసీ చేసుకోవాలి'
SRD: కంగ్టి మండల సర్దార్ తండా గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలు ఈ- కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని కార్యదర్శి సంతోష్ తెలిపారు. జాబ్ కార్డులో పేర్లు ఉన్న ఉపాధి కూలీలందరూ ఈ -కేవైసీకి సహకరించాలని ఆయన కోరారు. ఇది చేసుకున్న కూలీలు ఉపాధి హామీ పనులు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మేట్ స్వరూప్ చంద్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.