అక్కివరం జాతరకు రూ.5 లక్షల విరాళం

VZM: డెంకాడ మండలంలోని అక్కివరంలో వెలసిన పైడితల్లమ్మ, అసిరి తల్లమ్మ, ఇతర అమ్మవార్లకు మే 12న జరగనున్న జాతర మహోత్సవం సందర్భంగా మాజీ జడ్పిటిసి కంది సూర్యనారాయణ, రాజు దంపతులు రూ.5,03,100 విరాళాన్ని పండగ కమిటీ సభ్యులకు అందజేశారు. చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, యువత ఏర్పాటు చేస్తున్నారు.