'జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

NLG: జిల్లాలో ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉ. 9 గంటలకు క్లాక్ టవర్ చౌరస్తాలో ఉత్సవాలు జరగనున్నాయని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.