VIDEO: సత్తెనపల్లిలో అధ్వాన్నంగా రహదారులు
PLD: సత్తెనపల్లిలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా తాలూకా సెంటర్ వద్ద ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నాణ్యత లోపం వల్ల రోడ్లు త్వరగా దెబ్బతిన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ కుదుపుల వల్ల వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. అటు రైల్వే స్టేషన్ రోడ్డులో అక్రమ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ నరకంగా మారింది.