WWC: మధ్యాహ్నం 3 గంటలకు.. గెలుపెవరిదో?

భారత్, పాకిస్తాన్ మరోసారి క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. ఉమెన్స్ ODI వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు పాక్‌తో జరిగిన 11 వన్డేల్లోనూ భారత్ ఏకపక్షంగా విజయం సాధించింది. కాగా, మెన్స్ ఆసియా కప్‌లో షేక్ హ్యాండ్ వివాదం, పాక్‌ను భారత్ 3 సార్లు ఓడించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.