నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
AKP: ఎలమంచి(మం) పురుషోత్తపురం సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పులపర్తి, పురుషోత్తపురం లక్కవరం, రేగుపాలెం, లైన్ కొత్తూరు తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.