VIDEO: యూరియా కోసం రైతుల ఇక్కట్లు

KNR: శంకరపట్నం మండలం PACS గద్దపాక వద్ద రైతుల రద్దీ నెలకొంది. శుక్రవారం లారీలో యూరియా లోడ్ రావడంతో శనివారం వివిధ గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో రైతులు చేరుకుని క్యూ లైన్లో నిల్చున్నారు. యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు తెలిపారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా మండల, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.