మున్సిపల్ కమిషనర్‌కు వినతి

మున్సిపల్ కమిషనర్‌కు వినతి

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని ​పీర్ల కొట్టం బజారులోని గోడౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మిఠాయి కర్మాగారం నడుపుతూ, వెలువడుతున్న పొగతో స్థానికులు, అంగన్‌వాడీ పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని 16వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు ఆకుల రాము, బత్తిని వీరప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.