నగరానికి తుఫాను ప్రభావం..!

నగరానికి తుఫాను ప్రభావం..!

HYD: నగరంలో నిన్నటి తరహాలోనే వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. నగరం మొత్తంలో సుమారు 50% ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం-అర్ధరాత్రి మధ్యలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.