విచారణకు రావాలని సిట్ లేఖ.. గడువు కోరిన కారుమూరి

విచారణకు రావాలని సిట్ లేఖ.. గడువు కోరిన కారుమూరి

AP: లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ టెండర్ల కేసుకు సంబంధించి సిట్ అధికారులకు కారుమూరి నాగేశ్వరరావు లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు వారం సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. తన భార్యకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. కాగా మద్యం రవాణా కాంట్రాక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు అభియోగాలు రావడంతో కారుమూరికి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.