అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. అందులో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో ఈ ఘటన జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.