పరికరాల గుర్తింపు కోసం నియోజకవర్గస్థాయి శిబిరం
CTR: సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో వృద్ధులు, వికలాంగులకు పరికరాల గుర్తింపు కోసం నియోజకవర్గస్థాయి శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీరి కోసం అధికారులు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా శిబిరం వద్ద ఏర్పాట్లు చేశారు.