జిల్లా పోలీస్ కార్యాలయంలో పుట్టపర్తి జయంతి
ELR: పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్ ఆదేశాలపై ఎస్పీ (నాన్ క్యాడర్) సూర్యచంద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. 1914 మార్చి 28న అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించిన ఆయన గొప్ప పండితుడని చెప్పుకొచ్చారు.