మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మంత్రి నారా లోకేష్‌ను ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని మంత్రికి వివరించారు. నియోజకవర్గం సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన తీరుపై ఎమ్మెల్యేను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.