నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ
NLG: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన హైకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో నల్గొండ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 33 ZPTC, 33 MPP పదవుల భవితవ్యాన్ని, అలాగే 353 MPTC స్థానాలు, 869 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.