VIDEO: ఆక్రమణపై ఎమ్మెల్యే సీరియస్

VIDEO: ఆక్రమణపై ఎమ్మెల్యే సీరియస్

కోనసీమ: అయినవిల్లి(మం) కే. జగన్నాధపురంలో స్మశాన వాటిక ఆక్రమణకు గురైందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్మశానాన్ని ఆక్రమించి షెడ్ నిర్మించడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.