వీరుల త్యాగఫలం మన స్వాతంత్య్రం: ఎమ్మెల్యే

కోనసీమ:రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన ఎందరో వీరుల త్యాగఫలం మనకు స్వాతంత్య్రంగా సిద్ధించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడపాలెం పంచాయతీ కార్యాలయం మరియు హై స్కూల్‌లో ఆయన త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు.