'పీఎం శ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగించాలి'

KMM: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులు సమర్థవంతంగా వినియోగించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎం శ్రీ పాఠశాలలపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, పాఠశాల నిర్వహణ గ్రాంట్ క్రింద మంజూరు చేసిన నిధులను వినియోగించిన తీరు వివరాలను అందించాలని ఆదేశించారు.