VIDEO: కోతకు గురైన కట్ట.. స్పందించని అధికారులు

VIDEO: కోతకు గురైన కట్ట.. స్పందించని అధికారులు

MDK: గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ సమీపంలోని చిన్న చెరువు కట్ట సగానికిపైగా కోతకు గురైంది. అప్పట్లో ఉధృతంగా ప్రవహించిన నీటికి కట్ట బలహీనపడి కుంగిపోయింది. ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్నా, అధికారులు ఇప్పటివరకు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలన్నారు.