బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో మార్చి 6 నుంచి మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ ప్రత్యేక విద్యా కళాశాల విద్యార్థులకు మార్చి 6న పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.