విశాఖలో అంగన్‌వాడీల ఆందోళన

విశాఖలో అంగన్‌వాడీల ఆందోళన

VSP: అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం విశాఖలో ఆందోళన జరిగింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్స్‌ నల్ల రిబ్బన్లు ధరించి గురువారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని కోరారు.