వ్యవసాయ కళాశాల కోసం అనువైన భూముల పరిశీలన

SRPT: పాలకీడు మండలంలోని గుండ్లపహాడ్, హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 1041 భూములు వ్యవసాయ కళాశాల నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులుతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు.