జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం

జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‎లో జరిగే ఈ వేడుకకు 7 దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. జస్టిస్ సూర్యకాంత్‎‌తో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించనున్నారు.