VIDEO: గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఫై సీపీఎం ధర్నా
WNP: ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ధోరణిని ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదివారం వనపర్తి జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా నందు సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. సీపీఎం జిల్లా అధ్యక్షుడు పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. సిలిండర్ ధరలు నిరంతర పెరుగుదలతో సామాన్య కుటుంబాల జీవితం కష్టకరంగా మారిందన్నారు.