రోడ్డుపై ధాన్యం.. రైతు దయానీయం

రోడ్డుపై ధాన్యం.. రైతు దయానీయం

NZB: ఆరుగాలం కష్టపడి పండించిన పంట భారీగా కురుస్తున్న వర్షాలకు నీటి పాలవుతుంటే రైతులు ఏం చేయాలో తోచక దీన స్థితిలో ఉన్నారు. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామ శివారులో రైతులు బీటీ రోడ్డు వెంట ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీటిపాలైంది. ఇదిలాగే కొనసాగితే ధాన్యం ఎందుకు పనికి రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.