H.జంక్షన్ ఫోటోగ్రాఫర్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు
కృష్ణా: H.జంక్షన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్‌లో ‘బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈ అవార్డును JNTU ఫైన్ ఆర్ట్స్ విభాగ ప్రొఫెసర్ కమలారాయ్, AP ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోసిన వీరేంద్రకుమార్, కార్యదర్శి మద్దాల శేఖర్ అందజేశారు. ఆయనను సినీ నటుడు బాబు మోహన్ అభినందించారు.