నీటిపారుదల అభివృద్ధిపై నిమ్మలతో లీలాకృష్ణ భేటీ

నీటిపారుదల అభివృద్ధిపై నిమ్మలతో లీలాకృష్ణ భేటీ

E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ మంగళవారం విజయవాడలోని వారి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న నీటిపారుదల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.