క్రిప్టో లింక్‌లు క్లిక్ చేయొద్దు: జనసేన సూచన

క్రిప్టో లింక్‌లు క్లిక్ చేయొద్దు: జనసేన సూచన

AP: జనసేన పార్టీ అధికారిక 'X' అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన వ్యక్తులు యూకే నుంచి అకౌంట్ లాగిన్ చేసినట్లుగా పార్టీ సైబర్ టీమ్ గుర్తించింది. హ్యాకర్లు అకౌంట్‌లో బిట్ కాయిన్, క్రిప్టో ట్రేడింగ్ లింక్‌లను పోస్ట్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆ ట్రేడింగ్ లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని జనసేన సూచించింది.