నాగార్జున సాగర్ కాలువకు గండి.. భయం గుప్పిట్లో 20 గ్రామాలు

నాగార్జున సాగర్ కాలువకు గండి.. భయం గుప్పిట్లో 20 గ్రామాలు

పల్నాడు: కారంపూడి వద్ద గురువారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ కుడికాలువ ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండి పడింది. దీంతో నాగులేటి వాగులో ప్రవాహం పెరిగింది. 20 గ్రామాల ప్రజలు, వీరుల తిరునాళ్ల వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టులోని మూడు దుకాణాల్లోకి నీరు చేరింది. ఎన్ఎస్పీ అధికారులు వెంటనే యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో గండి పూడ్చే పనులు చేపట్టారు.