VIDEO: నరసింహుడి హుండీ ఆదాయం రూ. 35.62లక్షలు

VIDEO: నరసింహుడి హుండీ ఆదాయం రూ. 35.62లక్షలు

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం హుండీలను తెరిచి లెక్కించారు. 83 రోజుల ఆదాయం మొత్తం రూ. 35,62,444 లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. నగదుతో పాటు 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి, పలు దేశాల కరెన్సీ నోట్లు కూడా లభించాయి.