గజ్వేల్ పట్టణంలో దొంగల బీభత్సం

SDPT: గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్‌లో గల డెలివరీ డాట్ కాం కార్యాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న లక్ష 47 వేల నగదు ఎత్తుకెళ్లి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేశారని గజ్వేల్ క్రైమ్ సీఐ ముత్యం రాజు తెలిపారు. క్లూస్ టీంని రప్పించి దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ ముత్యం రాజు తెలిపారు.