'అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన అందించాలి'
PPM: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన అందించాలని డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ధారాలంగా చదవడంతో పాటు గణితంలో కూడా పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పటిష్టమైన పునాది ఉండాలన్నారు.