తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

అన్నమయ్య: రాజంపేట నూతన సబ్ కలెక్టర్ భావన గురువారం వీరబల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు రెవెన్యూ సంబంధిత సమస్యలు, రికార్డుల నిర్వహణ, పౌర సేవలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని సూచనలు చేశారు.