VIDEO: శివాలయంలో చోరీ.. నగదు అపహరణ..!
ASF: వాంకిడి మండల కేంద్రంలోని శివాలయంలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 20న గుర్తుతెలియని యువకులు ఆలయంలోకి చొరబడి 3 హుండీలలో నుంచి సుమారు రూ. 50,000 నగదును అపహరించినట్లు పూజారి మనోజ్ తెలిపారు. హుండీల తాళాలు ధ్వంసమైనట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.