VIDEO: తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోలు ఆందోళన
ELR: బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం మండలంలోని వీఆర్వోలు నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో తమను కించపరుస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వీఆర్వోలు తెలిపారు. తహసీల్దార్ చలపతిరావును విధుల నుంచి తప్పించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి వీఆర్వోలపై తహసీల్దార్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.