'అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలి'
AKP: రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ డీఆర్వో, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సేవలలో సమయపాలన, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను కట్టుదిట్టం చేయాలన్నారు.