ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏఆర్ కానిస్టేబుల్ మృతి
HNK: నగరంలోని కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మృతి చెందింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.