వారంపాటు రైల్వే గేట్ మూసివేత
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలోని లెవల్ క్రాసింగ్ వద్ద గల రైల్వే గేట్ నం. 34ను ఇవాళ నుంచి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ పెద్దపల్లి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ తెలిపారు. రైల్వే అత్యవసర పనుల కారణంగా సుల్తానాబాద్-కాల్వశ్రీరాంపూర్ మార్గంలో ఈ గేటును వారం రోజులపాటు మూసివేయనున్నారు. ఈ అంతరాయానికి ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు.