నేడు రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా చెల్లింపు
MNCL: సింగరేణి సంస్థలో 2024-25లో రిటైరైన కార్మికులకు 35 శాతం లాభాల వాటాను గురువారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. అలాగే దీపావళి బోనస్(పీఎల్ఆర్) ఈనెల 23న చెల్లించనున్నట్లు వారు పేర్కొన్నారు. తమ సంఘం ఒత్తిడి మేరకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.