VIDEO: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్‌తో పాటు నందనం సొసైటీలో తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన ధరలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యవర్తులు లేకుండా నేరుగా కేంద్రాలకు పంటను తీసుకువచ్చి విక్రయించాలని రైతులకు సూచించారు.