VIDEO: గోతులమయంగా బూర్జవలస-గ్రోత్ సెంటర్ రోడ్డు
VZM: బొబ్బిలి మండలం ఎం. బూర్జవలస-గ్రోత్ సెంటర్ రోడ్డు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరడంతో గోతులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డు బాగు చేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడంలేదని కార్మికులు వాపోతున్నారు.