హైవేపై కారు దగ్ధం

TPT: దొరవారిసత్రం మండలం ఎన్ఎం అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి షార్ట్ సర్క్యుట్‌తో కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు సూళ్లూరుపేట మండల పరిధిలోని గుమ్మడి తాగేల నుంచి నాయుడుపేటకు వెళుతున్న స్కార్పియో కారు ప్రమాదవశాత్తు ఇంజిన్‌లో మంటలు రావడంతో డ్రైవర్ కారును పక్కన ఆపేశాడు. దీంతో కారులో పూర్తిగా మంటలు చెలరేగి దగ్ధమైంది.