వేల్పూర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్: వేల్పూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ గావించి జెండా వందనం చేశారు. రజక సంఘం సభ్యులు ఒకరినొకరు మిఠాయి తెనిపించుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ విశిష్టతను కొనియాడారు.