VIDEO: 'ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేసాం'

SRCL: మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేసామని ముస్లిం మైనారిటీ మండల అధ్యక్షుడు మహమ్మద్ హమీద్ అన్నారు. తంగళ్ళపల్లిలోని మజీద్‌లో ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ.. మొదటగా మజీదులో ప్రార్థనలు చేసి అనంతరం వృద్ధాశ్రమంలో పండ్లను పంపిణీ చేశామన్నారు.