ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్: ఎమ్మెల్యే

CTR: ప్రస్తుతం బుధవారం జరుగుతున్న ఎమ్మెల్యే ప్రజా దర్బార్.. ఇకపై పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం తెలిపారు. లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించ గలరని ఎమ్మెల్యే తెలిపారు.