'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
W.G: నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.