పల్లె పోరుకి సిద్ధమా..?

ADB: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావహులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. త్వరలో స్థానిక పోరుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ADB జిల్లాలో 20 ZPTC, 166 MPTC, 473 సర్పంచ్ స్థానాలున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ప్రతినిధులు తమకే మద్దతు తెలపాలని జిల్లా నాయకులను కలుస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు.