10వ తరగతి విద్యార్థి మిస్సింగ్
GDWL: ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన మల్లెపోగు జోయల్ కుమార్ (15) అనే 10వ తరగతి విద్యార్థి సోమవారం ఉదయం 9 గంటలకు అల్లంపూర్ చౌరస్తా నుంచి బయలుదేరిన అనంతరం కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బాలుడిని గుర్తించిన వారు 8309338552 నంబర్ను సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరారు.