పాకిస్తాన్‌లో ఆకాశానంటుతున్న గ్యాస్ ధరలు!
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రమైంది. గ్యాస్ సిలిండర్ ధర రూ.5 వేలు దాటడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. అలాగే, రవాణా ఛార్జీలు పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో చమురు నిల్వలు నిండుకోవడంతో, ఏప్రిల్ మధ్య నాటికి గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సరఫరా కోసం పాక్ ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది.