VIDEO: చిన్నారులతో ముచ్చటించిన ఆర్డీవో
SDPT: బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించిన హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా వచ్చిన ఆయన మధ్యాహ్న భోజనం నాణ్యతపై చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. బియ్యం, కూర రుచులు, వంట విధానం గురించి విచారించి విద్యార్థుల సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు.